శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కర్నాటక హాసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది మృత్యువాత

road accident
కర్నాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది 
 
టెంపో ట్రావెలర్‌ బస్సును, పాల లారీ ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాదంలో మూడు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటన గండి నగర్‌ సమీపంలోని బీరువా గ్రామం దగ్గర చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.