సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (08:54 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. పదిమంది మృతి

road accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొనడంతో.. బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
  
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ – ఔరంగాబాద్ రహదారిపై నందూర్నాక వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఈ ఘటనను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే ధృవీకరించారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.