సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (11:25 IST)

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. దర్శనాల సమయం పొడగింపు

sabarimala devotees
శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శబరిమల కొండపై భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో దర్శనాల సమయాన్ని మరో గంట పాటు పొడగించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 
 
ఇప్పటివరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించి రాత్రి పది గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. 
 
అయ్యప్ప దర్శనాలను ఒక గంట ముందుగానే ప్రారంభించడం వల్ల మరింత మంది భక్తులకు స్వామి దర్శనం కలుగుతుందని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. దీంతో పాటు భక్తుల రద్దీ కూడా కొంతమేరకు తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇక ప్రతి రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల మంది బుకింగ్‌లు స్పాట్‌లో 30 వేల బుకింగ్స్‌లో ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించే ఐజీ స్పర్జన్ కుమార్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కాస్త ఆటంకం కలుగుతుందని చెప్పారు.