ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (19:53 IST)

యూట్యూబ్‌ని చూసి నకిలీ కరెన్సీ... మహారాష్ట్రలో వ్యక్తి అరెస్ట్

currency notes
యూట్యూబ్‌ని చూసి నకిలీ కరెన్సీని ముద్రించిన వ్యక్తిని అరెస్టు చేసి, అతను ఉపయోగించిన యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్గావ్‌లో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీని తరువాత, పోలీసులు ఆ ప్రాంతాన్ని విచారించారు. అనుమానాస్పద ప్రదేశంగా రాజేంద్రన్ యాదవ్ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. అప్పుడు అతని వద్ద రూ.1.6 లక్షల విలువైన నకిలీ నోట్లు, ప్రింటింగ్ మిషన్లు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
దీనిపై పోలీసులు అతడిని విచారించగా.. యూట్యూబ్‌ని చూసి నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నాడని, కొద్దికొద్దిగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నాడని తేలింది. 100, 200, 500 రూపాయల నకిలీ నోట్లను తయారు చేసి అరెస్టు చేశారు.