శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:37 IST)

వదినతో అక్రమ సంబంధం.. వద్దన్నా వినలేదు.. అందుకే చంపేశారా?

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు మండలంలోని యడవల్లిలోని క్వారీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. 
 
భార్యతో కలిసి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు. కానీ మంగళవారం అర్థరాత్రి చిలకలూరి పేట వద్ద హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంజనీరాజు హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. 
 
అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం నెరపాడు. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సర్దిచెప్పినా వినకుండా వదినతో వివాహేతర సంబంధం నెరపిన అంజనీరాజును హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అంజనీరాజు సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసుపై విచారణను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.