హంగూ ఆర్భాటాలతో పెళ్ళిళ్లు అవసరమా..? ఏదైనా చట్టమొస్తే బాగుండు..
దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల ఫ్యాషన్ జరుగుతోంది. పెళ్లిళ్ల విషయంలో. యువతీ యువకులు భారీగా ఖర్చు పెట్టి, హంగూ ఆర్భాటాలతో పెళ్లిల్లు చేసుకుంటున్నారు. డబ్బున్న వారికైతే ఓకే కానీ.. అంతంత మాత్రంగానే ఉండేవారు కూడా అవనసరంగా అప్పులు చేసి మరీ బాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. దీని కారణంగా పెళ్లి తరువాత ఆ వధూవరుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నాయి.
మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా వ్యాపారంగా మారాయి. ఖరీదైన దుస్తులు, భారీ వేదికలు, పదుల సంఖ్యలో వెరైటీలు కలిగిన డిన్నర్.. ఇలా ప్రతి అంశంలోనూ వధూవరుల కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఇక మన దేశంలో వధువు వరుడికి కట్నం ఇవ్వడం అన్న దురాచారం ఉండనే ఉంది. దాంతో వధువు తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది.
ఇక మరోవైపు వరుడి కుటుంబంలోనూ ఆర్థికంగా లేకపోయినా పెళ్లి విషయానికి వచ్చే సరికి అప్పో సొప్పో చేసి మరీ భారీగానే వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తుండడం వల్ల తదుపరి కాలంలో పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.
ఈ క్రమంలో ఈ విషయంపై పలువురు సామాజిక వేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఇలా పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేయకుండా, కొంత డబ్బు మాత్రమే ఖర్చు పెట్టేలా కొత్తగా ఏదైనా చట్టాన్ని తీసుకువస్తే అటు పేద, మధ్య తరగతి కుటుంబాలకు అనువుగా ఉంటుందంటున్నారు.