శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (11:33 IST)

ఉపాధి కోసం మళ్లీ ముంబై బాటపట్టిన వలస కూలీలు

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు మళ్లీ ముంబై బాటపట్టారు. వీరిలో ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటూ వచ్చిన వలస కూలీలు తమతమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇపుడు మళ్లీ నగరానికి తిరిగి వస్తున్నారు. 
 
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కర్మాగారాలు, మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో ఉపాధి కోసం మళ్లీ మహానగరంలో అడుగుపెడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లిపోయిన వారిలో దాదాపు ఐదున్నర లక్షల మంది మళ్లీ ముంబైలో అడుగుపెట్టినట్టు రైల్వే శాఖ నుంచి అందిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. 
 
వీరిలో కార్మికులు, వ్యాపారులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు ఉన్నారు. జూన్‌కు ముందు మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 మంది లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. వారిలో ఇప్పుడు చాలా మంది తిరిగి ముంబై చేరుకుంటున్నారు.