బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:57 IST)

ఫేస్‌బుక్ ఫ్రెండ్... రమ్మన్నాడు, వచ్చాక లైంగిక సుఖం కావాలన్నాడు... అంతే...

ఫేస్‌బుక్ స్నేహం పేరుతో ఓ యువతిని తన ఇంటికి పిలిచిన ఓ కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ దారుణం తూర్పు ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు ముంబైకి చెందిన హరిదాస్‌ నిర్గుడే (25),

ఫేస్‌బుక్ స్నేహం పేరుతో ఓ యువతిని తన ఇంటికి పిలిచిన ఓ కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ దారుణం తూర్పు ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు ముంబైకి చెందిన హరిదాస్‌ నిర్గుడే (25), వాసి ప్రాంతానికి చెందిన అంకిత మోర్‌ (20)ని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. అలా కొన్ని నెలలుపాటు చాటింగ్ చేసుకుంటూ రావడంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో గత ఆదివారం ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. 
 
ఇంటికి వచ్చిన తర్వాత ఆ యువతి వద్ద తన మనసులోని కోరికను వెల్లడించాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. అదీ కూడా షూ లేస్‌త మెడకు ఉరిబిగించిమరీ చంపేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.