సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 డిశెంబరు 2021 (19:07 IST)

తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు: కిషన్ రెడ్డి

భారత ప్రభుత్వం ద్వారా తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు పెరిగిందన్నారు కేంద్రమంత్రివర్యులు కిషన్ రెడ్డి. కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందనీ, రాష్ట్ర రైతులకు 4-5 రెట్ల ప్రయోజనం కలిగిందని తెలిపారు.


"తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. గత రబీ సీజన్ కు సంబంధించి FCIకు ఇవ్వవలసిన 14 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను, 13 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది." అని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.