మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (19:27 IST)

11 రోజులు దీక్షలో ప్రధాని.. నేలపై నిద్ర.. కొబ్బరి నీళ్లు తాగుతూ..?

narendra modi
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని నియమాలు, ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. 11 రోజుల పాటు దీక్షలో వున్నారు. 
11-రోజుల పాటు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ తపస్సు, ధాన్యంతో గడుపుతున్నారు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తీసుకోవడం లేదు. ఈ దీక్షలో భాగంగా ప్రధాని కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
జనవరి 12 నుండి ఆలయ సంప్రోక్షణకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ట" కోసం ప్రధాని మోదీ పూజలు చేస్తారని వర్గాలు తెలిపాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రాణ్ ప్రతిష్ట ప్రధాన కర్మలను నిర్వహిస్తుంది.
 
"ప్రాణ్ ప్రతిష్ట" అంటే విగ్రహాన్ని దైవిక స్పృహతో నింపడం, ప్రతి ఆలయంలో పూజించే ప్రతి విగ్రహానికి ఇది తప్పనిసరి. జనవరి 22 న మధ్యాహ్నం 12.30 గంటలకు దీనికి అనుకూలమైన సమయం అని ఆలయ కమిటీ తెలిపింది.
 
 
 
మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేత చెక్కబడిన ఐదేళ్ల వయసులో వున్న రాముడు నల్లరాతితో చెక్కబడిన రామ్ లల్లా విగ్రహాన్ని గత రాత్రి ఆలయానికి తీసుకెళ్లారు.