జయలలిత మృతి కేసు - పోలీసు విచారణకు వచ్చిన శశికళ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ, వాచ్‌మెన్ మృతి కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారణకు హాజరుకావాలని శశికళకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీచేశారు.
ఈ నోటీసులకు అనుగుణంగా గురువారం కొడనాడు ఎస్టేట్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు శశికళ విచారణకు హాజరయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకు ఈ చోరీ జరిగినట్టు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది.
అంతేకాకుండా, అన్నాడీఎంకేకు చెందిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. మరోవైపు, జయలలిత మృతి కేసు విచారణ కూడా జస్టిస్ ఆర్ముగం కమిషన్ జరుపుతుంది.