శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:15 IST)

స్వాంతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు: స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మంగ్లీ సిస్టర్స్

Mangli
స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జాతీయ జెండా ఎగరవేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగరవేశారు. అదే వేదిక మీద ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. 
  
అలాగే మల్లేశ్వరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇందిరావతి తదితరుల సంగీతకచేరి ఆకర్షణగా నిలిచింది. మంగ్లీ అండ్ టీమ్ సంగీత కచేరి బెంగళూరు ప్రజలను ఆకట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖా మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ ఆధ్వర్యంలో మల్లేశ్వరంలో ఆదివారం రాత్రి స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరిగాయి.
 
స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల సందర్బంగా మల్లేశ్వరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన తరువాత వేదిక మీద జాతీయ జెండా ఎగరవేసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సాటి మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ, ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరితో పాటు సొంత పార్టీ నాయకులు వున్నారు.