శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (10:37 IST)

గుంపులు గుంపులుగా తిరగొద్దు.. మాస్కులు తప్పనిసరి చేయండి..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా రెండో దశలోకి ప్రవేశించింది. 
 
దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స సామర్థ్యం పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. అదేవిధంగా ప్రజలు గుంపులుగా తిరగకుండా చూడాలని, మాస్కులు వేసుకోవడంతో పాటు ఇతర అన్ని కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. 
 
 అలాగే దేశంలో కొత్తగా 35,871 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,74,605కి చేరింది. ఇందులో 1,10,63,025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,52,364 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 172 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,216కి చేరింది.