సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:00 IST)

భర్త చనిపోయాడు.. పెన్షన్ కోసం వెళ్తే.. యువకుడు పరిచయం.. చివరికి..?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. వితంతు మహిళకు ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా అయిదు లక్షల రూపాయలు వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని శమాబల్ జిల్లాలోని అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నఖాశా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ మహిళకు కొద్ది కాలం క్రితం భర్త మరణించాడు. దీంతో వితంతు పెన్షన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. 
 
ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. వితంతు పెన్షన్ గురించి అడిగేందుకు ఆమె వెళ్తే.. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిలీఫ్ ఫండ్‌కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు దరఖాస్తు చేసుకుంటే అయిదు లక్షల రూపాయలు ఇస్తారు. మీకు అయిదు లక్షలు వచ్చేట్టు మేం చేస్తాం.' అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడిని కూడా ఆమెకు పరిచయం చేశాడు. అయిదు లక్షలను ఆమెకు వచ్చేలా చేసేందుకు గానూ అయిదు వేల రూపాయలు లంచం ఇవ్వాలని కోరారు.
 
దానికి ఆమె తన వద్ద అంత లేవనీ, రెండు వేల రూపాయలు ఇచ్చుకుంటానంది. వాళ్లు సరేనన్నారు. పేపర్ వర్క్ అంటూ ఇప్పటికే రెండు వేల రూపాయలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ మీటింగ్ అంటూ ఆమెను కలవమన్నారు. తమ బైక్ పై ఎక్కించుకుని ఊరి చివర ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లారు. ఆమెను బెదిరించి భయపెట్టి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత మరొకరు పశువుల్లా తమ కామ వాంఛను తీర్చుకున్నారు. 
 
ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బెదిరించారు. ఇలా కొద్ది నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. వారి ఆగడాలను భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.