1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రధాని మోడీజీ మీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించేందుకు సిగ్గెందుకు : ఉద్ధవ్ ఠాక్రే

uddhav Thackeray
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికేట్‌పై సరికొత్త చర్చ సాగుతోంది. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ వివరాలు కావాలంటూ అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు రూ.25 వేల అపరాధం విధించింది. దీంతో ఈ అంశం మరింతగా వివాదాస్పదమైంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివేసన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని మోడీని డిగ్రీ సర్టిఫికేట్ చూపించమని అడిగినందుకు రూ.25 వేలు ఫైర్ వేశారని విమర్శించారు. డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు. 
 
ముఖ్యమంత్రి పీఠం కోసమే సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ - ఎన్సీపీలు చేతులు కలిపాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. నిజమే.. మేం అధికారం కోసమే కలిశాం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కలిసే ఉన్నాం. ఇపుడు మరింత బలంగా తయారయ్యాం అంటూ అన్నారు.