బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:12 IST)

ఆ మంత్రికి సెల్ఫీ అంటే అస్సలు పడదు.. ఆయనెవరు? (video)

కర్ణాటక మంత్రి డీకే శివ కుమార్‌తో సెల్ఫీ దిగాలనుకున్న అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం బెళ్లారికి వచ్చిన మంత్రితో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయన వద్దకు వెళ్లాడు. ట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్య

కర్ణాటక మంత్రి డీకే శివ కుమార్‌తో సెల్ఫీ దిగాలనుకున్న అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం బెళ్లారికి వచ్చిన మంత్రితో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయన వద్దకు వెళ్లాడు. ట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకుంటూ మంత్రి శివకుమార్‌ను సమీపించాడు. 
 
 
వెంటనే తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అంతే కోపంతో మంత్రి ఆ అభిమాని ఫోనును కిందకు నెట్టారు. అంతే అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. కార్యకర్తలు కిందపడిన ఆ అభిమానిని అతని చేతికిచ్చారు. 
 
అయితే మరో అభిమానికి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. డీకే శివకుమార్‌కు సెల్ఫీలంటే పడవని.. గతంలో ఓ స్టూడెంట్ కూడా ఇలా సెల్ఫీకోసం ఎగబడుతుంటే అతనిపై కూడా మంత్రి చేజేసుకున్నారు.