శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:56 IST)

కమల్ హాసన్‌కు ఎందుకంత తొందర, ఓపిక లేదా?

రజినీకాంత్ తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటన వచ్చిన వెంటనే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగితేలారు. చాలామంది నేతలు రజినీకాంత్ పార్టీలో చేరడానికి సన్నద్థమవుతున్నారు. 
 
కానీ సహచర సినీనటుడు కమల్ హాసన్ మాత్రం రజినీకాంత్‌తో కలిసేందుకు సిద్థమన్నారు. రజినీ ఆహ్వానిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని స్పష్టం  చేశారు. రజినీ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కమల్ హాసన్ మక్కల్ నీతిమయ్యం అనే పార్టీని స్థాపించేశారు.
 
గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కానీ పెద్దగా స్పందన మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు రజినీకాంత్ పార్టీ పెడుతుండడంతో రాజకీయంగా నిలబడాలంటే రజినీతో కలవడమే మంచిదన్న ఉద్దేశంతో ఆయనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ప్రత్యామ్నాయంగా రజినీని జనం ఆదరించే అవకాశం ఉందని... దాంతో పాటు తాము కూడా కలిస్తే జనాల్లోకి ఈజీగా వెళ్ళగలమని భావిస్తున్నారట కమల్ హాసన్. అయితే కాస్త ఒపిక పట్టాలని.. పార్టీ విధివిధానాలు తెలియకుండా రజినీతో కలవడం అంత మంచిది కాదని కూడా కమల్ సన్నిహితులు హితబోధ చేస్తున్నారట.