ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (22:52 IST)

భారతదేశంలో ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల్లో మహిళలు అదుర్స్

office work
భారతదేశంలో ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలను ఎంచుకునే మహిళల సంఖ్య గత ఏడాది కంటే రెట్టింపు అయ్యింది. ఫిబ్రవరి 2023లో 4 శాతం నుండి 2024 ఫిబ్రవరిలో 8 శాతానికి పెరిగింది. టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ఫౌండిట్ ప్రకారం, 
గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా అభ్యర్థులకు 56 శాతం ఉద్యోగాలు పెరిగాయి.
 
ఒక కంపెనీ విజయంలో మహిళా కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తారు. వారు కష్టపడి పని చేసేవారు,  సృజనాత్మకంగా నిరూపించబడ్డారని క్వెస్ కంపెనీ ఫౌండిట్ సిఇఒ శేఖర్ గరిసా అన్నారు.
 
మహిళా నాయకులు తరచూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. ఒక జట్టులో ఎక్కువ మంది మహిళలు ఉండటం వలన కార్యాలయంలో పనులు సులభంగా జరుగుతాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, ఐటీ/కంప్యూటర్లు-సాఫ్ట్‌వేర్ రంగం మహిళలకు అవకాశాలను అందించడంలో ముందుందని, అందులో 36 శాతం మంది శ్రామిక శక్తి ఉందని నివేదిక వెల్లడించింది.
 
ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే మెట్రో నగరాల్లో వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం సానుకూలంగా  స్థిరంగా ఉంది. అదనంగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నాయకత్వ స్థానాలను లక్ష్యంగా చేసుకున్న 9 శాతం ఉద్యోగ నియామకాలతో మహిళలకు నాయకత్వ అవకాశాలలో గణనీయమైన పెరుగుదల ఉందని నివేదిక సూచించింది.