1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:16 IST)

బెంగాల్‌లో ఘోరం : చెరువులోకి దూసుకెళ్లిన బస్సు - కార్మికుల మృతి

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పుర్​లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, పలువురు వలస కూలీలు, ప్రయాణికులతో ఝార్ఖండ్​ నుంచి లక్నో వెళ్తున్న బస్సు రాయిగంజ్​లోని 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని(ట్రక్కుగా అనుమానం) బస్సు ఢీకొట్టిన అనంతరం అదుపు తప్పి.. చెరువులోకి దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. 
 
తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి.. అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.