1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:53 IST)

ఆ పార్టీ నుంచి లోక్ సభకి పోటీ చేస్తున్న యువరాజ్ సింగ్?

Yuvraj
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ వరుసలో పాలక పార్టీ భాజపా చాలా ముందుగా ప్రక్రియ ప్రారంభించేసింది. టార్గెట్ 400 సీట్లు విజయం దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఒకప్పటి క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యూవీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీనితో యువరాజ్ సింగ్ భాజపాలో చేరడం లాంఛనమేనని వార్తలు వస్తున్నాయి.
 
ఒకవేళ యువరాజ్ సింగ్ పోటీ చేస్తే పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు యూవీ కూడా ఇందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గౌతమ్ గంభీర్ భాజపా తరపున విజయం సాధించి లోక్ సభ సభ్యునిగా వున్నారు.