సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (13:45 IST)

రొయ్యలతో కూరలే కాదు.. కట్‌లెట్ కూడా..?

కావలసిన పదార్థాలు: రొయ్యలు - అరకిలో పుట్నాలు - 2 స్పూన్ పచ్చిమిర్చి - 16 అల్లం - చిన్నముక్క ఉల్లిపాయలు - 2 లవంగాలు - కొన్ని కొత్తమీర - 1 కట్ట ఉప్పు - తగినంత నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగా రొయ్య

కావలసిన పదార్థాలు:
రొయ్యలు - అరకిలో
పుట్నాలు - 2 స్పూన్
పచ్చిమిర్చి - 16
అల్లం - చిన్నముక్క
ఉల్లిపాయలు - 2 
లవంగాలు - కొన్ని
కొత్తమీర - 1 కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని వాటిలో కొద్దిగా పసుపు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పొసి వేడయ్యాక ఉల్లిపాయలు, లవంగాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పుట్నాలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో రొయ్యలు వేసుకుని మరికాసేపు వేయించాలి. ఆ తరువాత బ్రెడ్ ముక్కలను కట్ చేసుకుని అందులో ఈ రొయ్యల మిశ్రమాన్ని వేసుకుని కట్‌లెట్‌లా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. అంతే... వేడివేడి రొయ్యలు కట్‌లెట్ రెడీ.