శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (19:21 IST)

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్‌కు విశేష స్పందన

డాలస్: అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ డాలస్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇర్వింగ్ వేదికగా వచ్చే మే నెల 24, 25, 26 తేదీల్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీంతో స్థానికంగా ఉండే తెలుగు ప్రజలంతా ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 
 
డాలస్‌లో నిర్వహించిన ఫండ్ రైజింగ్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 6,00,000 డాలర్ల  విరాళాలను ఇచ్చేందుకు నాట్స్  సభ్యులు, తెలుగు ప్రజలు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నాట్స్ 6వ తెలుగు సంబరాలను కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. సంబరాలు ఎలా ఉంటాయనేది తెలుపుతూ అమెరికా తెలుగు సంబరాల కర్టన్ రైజర్ ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్ లోనే ఫండ్ రైజింగ్ కూడా చేశారు. దీనికి విచ్చేసిన స్థానిక తెలుగు ప్రజలంతా ముక్తకంఠంతో సంబరాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 
నాట్స్ బోర్డు డైరక్టర్, ఫండ్ రైజింగ్ డైరక్టర్ అయిన ఆది గెల్లి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను పరిచయం చేశారు. ఆలాపన టీం... ఈ ఈవెంట్లో సంగీత మధురిమలు పంచింది. ఇదే వేదికపై నాట్స్ డాలస్ చాప్టర్ 2019-20 నాయకత్వాన్ని కూడా నాట్స్ ప్రకటించింది. డాలస్ చాప్టర్ కో-ఆర్డినేటర్‌గా అశోక్ గుత్తా, సెక్రటరీగా డీవీ ప్రసాద్, హెల్ఫ్ లైన్ కమిటీ చైర్మన్‌గా సత్య శ్రీరామనేని, కో-ఛైర్మన్‌గా రవి తాండ్ర, రాజీవ్ కంభంను నియమించింది. 
 
స్పోర్ట్స్ ఛైర్మన్‌గా శ్రీనివాస్ కాసర్ల, సత్య శ్రీరామనేని, మహిళా సాధికారిత ఛైర్మన్‌గా కవితాదొడ్డా, వెబ్ కమిటీ ఛైర్మన్‌గా శ్రీథర్ నేలమడుగుల, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ ఛైర్మన్‌గా విజయ్ కొండ, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఆర్య బొమ్మినేని, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్మన్‌గా రాజేంద్ర యనమదలకు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు డైరక్టర్స్.. ఆది గెల్లి, రాజేంద్ర మాదాల, అమర్ అన్నే, రాజ్ అల్లాడ, నాట్స్ ఇ.సి నుండి బాపు నూతి, శేఖర్ అన్నే, అజయ్ గోవాడ, జ్యోతి వనం తదితరులు హాజరయ్యారు.