శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (14:15 IST)

వావ్... లాస్ ఏంజెల్స్‌లో కన్నుల పండువగా నాట్స్ బాలల సంబరాలు

లాస్ ఏంజెల్స్: NATS  ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ... భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది అనడములో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
 
“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను అమెరికాలో వున్న తెలుగు వారందరిని ఏకం చేస్తూ.. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా చేసే వేడుకలు భావి తరాలు గుర్తుంచుకునేలా చేస్తోంది నాట్స్.
 
ఈ క్రమములోనే భారత తొలి ప్రధాని చాచా నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన బాలల సంబరాలలో “నేటి బాలలే రేపటి భావి పౌరులు” అంటూ చిన్నారులను ప్రోత్సహించే దిశగా ఆయా రంగాలలో అమెరికా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేషనల్ స్పెల్లింగ్ బీ 2018 ఛాంపియన్ కార్తిక్ నేమాని, పిన్న వయసులోనే నేషనల్ స్పెల్లింగ్ బీ మేధావిగా గుర్తింపు పొందిన ఆకాష్ వుకోటి, బ్లైండ్ ఫోల్డ్ చెస్‌లో నిష్ణాతుడైన ఆర్యన్ గుట్ల, మరియు ప్రస్తుతం తెలుగు సినిమాలో నటించిన బాలనటులు శ్లోక గొర్తి, చంద్రహాస్ మెరిసేర్లను ఈ కార్యక్రమమంలో వేద మంత్రాల మధ్య వేదిక మీదికి ఆహ్వానించి వారిని ఆశీర్వదించారు.  
 
నాట్స్ నిర్వహించిన చదరంగం పోటీలలో 40 మంది చిన్నారులు ఉత్సాహాముగా పాల్గొన్నారు. ఐవీ లీగ్ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థి శ్రీనివాస్ పంగులూరి యూనివర్సిటీలలో ప్రవేశించడానికి గల మెళుకువలను వారు పాటించిన క్రమశిక్షణను అక్కడికి వచ్చిన బాలలకు మరియు తల్లిదండ్రులకు తెలియపరిచారు.
 
కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ‘ఆండీ హొంగ్ ‘ హై స్కూల్ స్టూడెంట్స్‌కి పాటించవలసిన జాగ్రత్తలు, SAT, ACT ప్రిపరేషన్‌కి సలహాలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చక్కగా వివరించి, స్టూడెంట్స్ అందరి సందేహాలను తీర్చారు. గోదా క్షేత్ర సురభి అభినయించిన రుద్రమదేవి ఏకపాత్రాభినయం, Cerritos మనబడి విద్యార్థులు ప్రదర్శించిన తెలుగు స్కిట్ అందరిని అలరించింది. తొమ్మిది సంవత్సరాల ఆర్యన్ గుట్ల స్టేజి మీద చేసిన బ్లైండ్ చెస్ ఆడి ప్రేక్షకులను అబ్బురపరిచారు. స్పెల్లింగ్ బీ ఛాంపియన్ కార్తిక్ నేమాని, బాల మేథావి ఆకాష్ వుకోటి మధ్య నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీ ఎంతో ఉత్సాహంగా సాగింది. చివరిలో హాలీవుడ్ మెజీషియన్ స్టీవ్ మ్యాజిక్ షో అత్యంత కుతూహలంగా వినోదభరితముగా పిల్లలని, పెద్దలని మంత్రముగ్ధుల్ని చేసింది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన NATS ప్రెసిడెంట్ మంచికలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమం నిర్వహించిన LA చాప్టర్‌ని, వారికి మార్గదర్శనం చేసిన డాక్టర్ రవి ఆలపాటి గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని చాఫ్టర్లలో నిర్వహిస్తామని ప్రకటించారు. అలానే చెస్ విజేతలను మరియు కార్యక్రమానికి వచ్చిన జీనియస్ కిడ్స్‌ని సన్మానించారు. ఆపదలో వున్న తెలుగువారికి NATS హెల్ప్ లైన్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నదని తెలియచేసారు. ఇంకా ఈ కార్యక్రమానికి NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రవి ఆలపాటి, మధు బోడపాటి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి చందు నంగినేని, వంశీ గరికపాటి, రామ్ కొడితల, వెంకట్ ఆలపాటి, కృష్ణ మల్లిన హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమానికి చిన్నారులు శ్రేష్ఠ కోడె, శ్రీయ చింతమనేని, సాహితి బోడపాటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి బాలల సంబరాలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. విష్ణు కేటరింగ్ అతిథులకు పసందైన విందు భోజనాన్ని అందజేశారు. తెలుగు భాషా ప్రియులకు రమ్యమైన కార్యక్రమాలు అందిస్తూ... స్థానిక కళాకారులను, చిన్నారుల్లో సృజనాత్మకతను, ప్రతిభను ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న NATS ప్రవాసాంధ్రుల కొరకు ఏర్పరచిన స్వచ్చంధ సంస్థ. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా మన తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యముతో పాటు సామాజిక హితమైన ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆ దిశగా అమెరికాతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికి విదితమే.
 
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్ కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురుకొంక, రాజలక్ష్మి చిలుకూరి, సువర్ష కామరసు, సుధీర్ కోట, శంకర్ సింగంశెట్టి, మురళి ముద్దెన, వినయ్ కమతం, నాగరాజకుమార్ పెనుమత్స, నరసింహాచారి, నరేష్, శ్రీకాంత్ అట్టోటి, కిరణ్ తాడిపత్రి, దిలిప్, ఆనంద్, నరసింహ రావు, మాస్టర్ శివ పిడికిటి, మాస్టర్ నితిన్, మాస్టర్ సాత్విక్, మాస్టర్ నిఖిల్ లింగమనేని మరియు మాస్టర్ అశ్విత్ నండూరిలకు నాట్స్ లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు ధన్యవాదములు తెలిపారు.