శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (19:54 IST)

న్యూయార్క్‌లో హీల్ సంస్థ సమావేశం... లక్ష్యాలను వివరించిన డా.కోనేరు

విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెల్త్, అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (హీల్)సంస్థ న్యూయార్క్‌లో సదస్సు నిర్వహించింది.

విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెల్త్, అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (హీల్)సంస్థ న్యూయార్క్‌లో సదస్సు నిర్వహించింది. ఇందులో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్, నాట్స్ మాజీ ఛైర్మన్ డా. మధు కొర్రపాటితో పాటు పలువురు ఎన్.ఆర్.ఐ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ హీల్.. పేద విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్న హీల్ సంస్థ అంకిత అనాధశ్రమాన్ని గుంటూరులో నిర్వహిస్తుంది.
 
దీంతో పాటు భద్రాచలంలో కూడా పాఠశాల ఏర్పాటు చేసింది. హీల్ ప్యారడైజ్ విలేజ్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో కృష్ణా జిల్లాలోని గన్నవరం దగ్గర తోటపల్లి అనే గ్రామాన్ని ప్యారడైజ్ విలేజ్‌గా మార్చేందుకు హీల్ సంస్థ కృషి చేస్తోంది. సమాజంలో అందరికి సమానవకాశాలు ఉండాలని హీల్ సంస్థ భావిస్తుంది. దాని కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పేదరికం కారణంగా అవకాశాలు కోల్పోతున్న వారికి చేయూత ఇచ్చి వారికి అవకాశాలు అందుకునేలా చేసేందుకు కృషి చేస్తోంది. 
 
పేద పిల్లలను, అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని ఆ పిల్లలు వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడేలా హీల్‌లో తీర్చుదిద్దుతారు. హీల్ సంస్థ ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో కేవలం విద్యతో పాటు సంస్కారం, వినయవిధేయతలు, మానవీయ విలువలు, స్వశక్తితో ఎదగడం అనేది నేర్పిస్తారు. వృత్తి విద్యల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి వారి భవిష్యత్తుకు ఢోకాలేకుండా చేస్తారు.

హీల్  ప్రస్తుతం 1000 మంది చిన్నారులను అక్కున చేర్చుకుని వారి బంగారు భవితకు బాటలు వేస్తుంది. 2020 నాటికి 10000 మంది అనాధలకు ఆశ్రయంతో పాటు విద్య, ఉపాధి శిక్షణ ఇవ్వాలని ఆ దిశగా అడుగులు వేస్తుంది. న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో కోనేరు సత్యప్రసాద్ హీల్ సంస్థ లక్ష్యాల్లో ప్రతి మానవతావాది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.