గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By ivr
Last Modified: బుధవారం, 24 జూన్ 2015 (15:20 IST)

నన్ను ఎవరో తాకిరి...( వీడియో సాంగ్), ఎమ్మెస్ విశ్వనాథన్ బర్త్ డే

ఆ పాటలు వింటుంటే మరో లోకంలో విహరించినట్లు ఉంటుంది. ఆ రాగాలు వింటుంటే ప్రేమ సామ్రాజ్యంలో తిరుగాడుతున్నట్లనిపిస్తుంది. ఆ గీతాల సృష్టికర్త ఎమ్ఎస్ విశ్వనాథన్. ఆయన పుట్టినరోజు నేడే. 1928, జూన్ 24న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన ఎమ్మెస్ ఎన్నో చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు. 
 
తమిళంలో 510 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆయన మలయాళంలో 76, తెలుగులో 70 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లో లేత మనసులు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథకాదు, గుప్పెడు మనసు వంటి చిత్రాల్లోని పాటలు శ్రోతల మదిని ఎంతో ఆకట్టుకున్నాయి. మచ్చుకు సత్తెకాలపు సత్తయ్య చిత్రంలోని ఆరుద్ర మనసు నుంచి జాలువారిన భావాలు మీకోసం...
 
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
 
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
 
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో 
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో 
సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి 
 
ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో 
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి 
 
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
 
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో 
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో 
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి 
 
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో 
కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు 
 
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
 
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి 
 
చిత్రం : సత్తెకాలపు సత్తయ్య
గానం : ఘంటసాల, సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాధన్
చిత్ర దర్శకుడు: కె. బాలచందర్
సత్తెకాలపు సత్తయ్య వీడియో సాంగ్... యూ ట్యూబ్ నుంచి...