బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (08:53 IST)

గురువారం మీ దినఫలాలు : దాన ధర్మాలు చేయడం వల్ల

మేషం: దాన ధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యా

మేషం: దాన ధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువులు రాకపోకలు అధికమవుతాయి.
 
వృషభం: సోదరులకు శుభాకాంక్షలు అందజేస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి. 
 
మిథునం: వస్త్ర, ఫ్యాన్సీ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి వుంటుంది. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల, ప్రయాణాల్లో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించినట్లైతే సద్వినియోగం చేసుకోలేరు. 
 
కర్కాటకం: ప్రముఖులకు కానుకలు అందజేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది మెళకువ వహించండి.
 
సింహం: శత్రువులు మిత్రులుగా మారతారు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొనవలసివస్తుంది. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కన్య : సోదరులతో కలిసి దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
తుల: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో గడుపుతారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు నెలకొంటాయి. 
 
వృశ్చికం: స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులవల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు : మీ శ్రీమతి హితవు మీపై ప్రభావం చూపుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. 
 
మకరం: వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. కళత్ర వైఖరి చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. 
 
కుంభం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బలహీనతలు గోప్యంగా ఉంచాలి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం.