సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (09:11 IST)

గురువారం (19-04-2018) దినఫలాలు - కష్టపడి పనిచేస్తే డబ్బు...

మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉపాధ

మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
వృషభం : ఆటోమొబైల్, రవాణా, వెూకానికల్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు పనిభారం అధికమవుతుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. మీ స్నేహితుల వల్ల విలులైన వస్తువులు చేజారిపోతాయి.
 
మిధునం : మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు వెూపే అవకాశం ఉంది. బంధు మిత్రుల కలయిక మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పాత వస్తువులకు కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేరు. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది.
 
కర్కాటకం : విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్య విశయంలో మెళుకువ అవసరం.
 
సింహం : అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఏ.సి., కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రభుత్వ ఉద్యోదులకు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లను పొందుతారు.
 
కన్య : ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలసి వచ్చేకాలం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తకరంగా పూర్తి చేస్తారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు.
 
తుల : ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పని చేయనలసి ఉంటుంది. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం : రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పవు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు : గృహంలో మార్పులు, చేర్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చేటపుడు లౌక్యం పాటించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పత్రిక రంగాల్లో వారు, రచయితలు ఆశించే మార్పుల కోసం కొంతకాలం వేచియుండక తప్పదు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి.
 
మకరం : స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసివస్తుంది. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. పచారీ, ఫ్యాన్సీ, హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
కుంభం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యుల రాకపోకలు, ఊహించని ఖర్చులు ఎదుర్కోక తప్పదు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులపై ఉంచిన నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది.
 
మీనం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువుల పట్లఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులుచేర్పులు అనుకూలిస్తాయి.