గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (05:55 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 16-09-17

మేషం : కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. ఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. స్త్రీ

మేషం : కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. ఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. స్త్రీలు వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు.
 
వృషభం : ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
 
మిథునం : కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్రి కానరాదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం : మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దూరప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఋణ ప్రయత్నం ఫలిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
 
సింహం : సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం భంగపాటుకు గురవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య : దైవ, సేవకార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు.
 
తుల : కొబ్బరి, పండు, పూలు,పానియ, చిరు వ్యాపారులకు లాభం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
వృశ్చికం : ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
ధనస్సు : హామీలు, మధ్య వర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రేమికులకు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందగలవు. రుణయత్నాలు, చేబదుళ్లు తప్పవు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
మకరం : శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక పరిస్థితికి లోటుండదు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చేటు చేసుకుంటాయి.
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం.
 
మీనం : మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. రాజకీయ నాయకులు సభా, సమవేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం.