గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:59 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 12-09-17

మేషం : ఈ రోజు నదీ స్నానాలు ఆచరించునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇత

మేషం : ఈ రోజు నదీ స్నానాలు ఆచరించునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరాత్రా సహాయం అర్థిస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలో ఆమోదం గౌరవం లభిస్తాయి.
 
వృషభం : ఈ రోజు ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. లౌక్యంగా మెలిగి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పాత మిత్రులతో కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
మిథునం : ఈ రోజు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. వైద్య రంగాల వారికి ఆపరేషన్‌ల సమయంలో ఏకాగ్రత, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా ఎదగటానికి చేయు యత్నాలు ఫలించవు. ఉద్యోగస్తులకు స్థానచలనంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
సింహం : ఈ రోజు కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. తరచూ సభలూ, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య : ఈ రోజు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఆరోగ్యంలో మెలకువ వహించండి. కళాకారులకు రచయితలకు, పత్రికా రంగంలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల : ఈ రోజు దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
వృశ్చికం : ఈ రోజు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. స్త్రీలు, ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒప్పందాలు, చెక్కుల జారీ విషయంలో ఏకాగ్రత వహించండి. వాతావరణంలోని మార్పుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి.
 
ధనస్సు : ఈ రోజు నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్‌లో ఏకాగ్రత వహిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
మకరం : ఈ రోజు ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
కుంభం : ఈ రోజు మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది.
 
మీనం : ఈ రోజు ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. ప్రముఖులను కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చేపట్టిన పనుల సకాలంలో పూర్తి కాగలవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.