శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (05:55 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశిఫలితాలు 22-09-2017

మేషం : ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. జూదాలు, బెట్టింగ్‌‍ల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఉన్నతిపై కొంతమంది అపోహపడే ఆస్కారం వుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి

మేషం : ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. జూదాలు, బెట్టింగ్‌‍ల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఉన్నతిపై కొంతమంది అపోహపడే ఆస్కారం వుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. 
 
వృషభం : పెద్దమొత్తం నగదుతో ప్రయాణం తగదు. ఒత్తిడి, మొహమ్మాటాలకు లొంగవద్దు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రియతముల కలయికతో కుదుటపడతారు. ఆత్మీయుల సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. 
 
మిథునం : అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుంది. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. 
 
కర్కాటకం: మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శ్రమానంతరం మీరు కోరుకున్న ప్రాజెక్టులను దక్కించుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. 
 
సింహం: ఆర్థిక కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ధనానికి ఇబ్బంది ఉండదు. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వాముల మధ్య విబేధాలు సృష్టించేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కన్య: ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ఎదుటివారి వైఖరి అసహనం కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం: మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైనా సకాలంలో పూర్తి చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అధిక శ్రమ తప్పదు. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
ధనస్సు : మీరు అభిమానింటే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు.
 
మకరం : మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. రుణం ఏ కొంతైనా తీర్చటానికి చేసే యత్నం వాయిదాపడుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం : సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. 
 
మీనం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. రోజులు, భారంగాను విసుగ్గానూ సాగుతాయి. ముఖ్యమైన పనులను చేపట్టండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి.