సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (19:27 IST)

మంగళవారం 21 లడ్డూలు.. ఎరుపు రంగు పుష్పాలంటే హనుమంతునికి? (video)

Hanuman
మంగళవారం పూజతో అన్నీ సాధ్యమే. మంగళవారం పూట ఉపవసించి.. పూజ చేసే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. మంగళవారానికి నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి. అలాంటి అంగారకుని వల్ల ఏర్పడే ఈతిబాధలు, దోషాలు తొలగిపోవాలంటే.. ఆంజనేయ స్వామిని మంగళవారం పూట అర్చించాలి.

ఇంకా కుమార స్వామిని పూజించాలి. ఇలా చేస్తే అంగారకుడు కూడా సంతృప్తి చెందుతాడని.. తద్వారా ఆర్థిక ఇబ్బందులు, దోషాలతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అందుకే మంగళవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి.. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆపై ఎనిమిది రేకుల తామర పుష్పాన్ని పూజవద్ద వుంచాలి.

లక్ష్మీదేవికి ఈ పుష్పాన్ని సమర్పించాలి. ఎరుపు రంగుతో కూడిన ఆహార పదార్థాలను అంటే కేసరిబాత్‌ను నైవేద్యంగా సమర్పించి.. పూజను ముగించాలి. ఇంకా ఎరుపు రంగు పుష్పాలతో హనుమంతుడికి సమర్పించవచ్చు. 
 
ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా హనుమంతుడు ప్రీతి చెందుతాడు. 9 వారాల పాటు ఇలా మంగళవారం వ్రతమాచరించి.. హనుమంతుడిని పూజించాలి. ఇలా 21 వారాలు పూజించి ఆపై 21వ వారం ముగిశాక 21 లడ్డూలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఉపవాసం వుండేవారు.. కారం, ఉల్లి, వెల్లుల్లి, ఉప్పును వాడకూడదు. 
 
చివరి వారం హనుమంతుడికి ఆలయాల్లో అర్చన చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళవారం వ్రతం ఆచరించిన వారికి వివాహ, పుత్ర దోషాలు తొలగిపోతాయి. సకల సంపదలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.