బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:20 IST)

ఏ రోజు ఏ దీపం వెలిగించాలి..? శుక్రవారం పూట 60 దీపాలను..?

ఏ రోజు ఏ దీపం వెలిగించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. వారంలో తొలి రోజైన ఆదివారం పూట అయ్యప్ప స్వామికి దీపం వెలిగించడం శ్రేష్ఠం. ఈ దీపాలను తామర పువ్వులాంటి ఆకారంలో వెలిగించడం మంచిది. ఆదివారం వెలిగించే దీపానికి కొబ్బరి నూనెను వాడటం మంచిది. ఇలా చేయడం ద్వారా ఆదాయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. 
 
సోమవారం: అనాస పండు ఆకారంలో సోమవారం దీపాలను వెలిగించడం మంచిది. బియ్యం పిండితో ముగ్గులేసి.. దానిపై దీపాలను వెలిగించడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ దీపానికి బటర్ ఆయిల్ అని కూడా పిలువబడే మహువా నూనె ఆయిల్‌ను వాడితే శుభఫలితాలు చేకూరుతాయి. 
  
మంగళవారం పూట కూడా బియ్యం పిండితో రంగవల్లికలు వేసి.. అందులో దీపం వెలిగించాలి. 21 దీపాలను రెండు చిలుకల ఆకారంలో వుంచి దీపం వెలిగించడం మంచిది. నెయ్యి దీపాన్ని మంగళవారం వెలిగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందుతుంది. అలాగే బుధవారం 23 దీపాలను శంఖువు ముగ్గుపై వెలిగించడం చేయాలి. ఇందుకు నువ్వుల నూనెను వాడటం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో బుద్ధి వికాసం పెంపొందుతుంది.  
 
గురువారం.. కొబ్బరి నూనెతో సుదర్శన చక్రం ముగ్గుపై దీపం వెలిగించాలి. దీనివలన శత్రు భయం వుండదు. బంధువుల మధ్య ఐక్యత పెరుగుతుంది. శుక్రవారం పూట 60 దీపాలను వెలిగించడం విశేషం. 
 
వెన్నతో నెయ్యిని కాచి ఆ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా.. ఖర్చులు తగ్గుతాయి. విపరీతమైన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. శనివారం నువ్వుల నూనెతో 80 దీపాలను వెలిగించడం ద్వారా శనిదోష బాధలుండవు. ఈ దీపం పితృదోషాలను తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.