ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జులై 2024 (21:01 IST)

కాలసర్ప దోషంతో ఆర్థిక నష్టాలు.. ఇవి చేస్తే...?

kalasarpa dosha
జాతకంలో కాలసర్ప దోషం ఉంటే చాలా బాధ కలుగుతుంది. ఈ దోషం ఉన్నవారు డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక నష్టాలు ఎక్కువ. జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. 
 
అందుచేత ప్రతిరోజూ భైరవాష్టకం చదవడం, పూజించడం ద్వారా కాల సర్ప దోషానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కాల సర్ప దోషాన్ని తొలగించడానికి ప్రతి బుధవారం ఒక నల్లని బట్ట తీసుకుని మినప పప్పు, లేదా శనగలు, రాహు మంత్రాన్ని జపించి, అవసరమైన వ్యక్తికి దానం చేయండి. 
 
నాసిక్‌లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాల సర్ప దోష ఆరాధనకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. 
 
కాల సర్ప దోషాన్ని తొలగించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజూ 108 సార్లు జపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.