శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జులై 2024 (10:00 IST)

జూలై 2న యోగిని ఏకాదశి.. ఉపవాసం వుంటే మోక్షమే..

ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. యోగినీ ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి ఆరోగ్యంగా జీవిస్తారు. సంపన్నత చేకూరుతుంది. ఆహ్లాదకరమైన  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మ పురాణం చెప్తోంది. ఈ ఉపవాసం వుండటం ద్వారా 80వేల మంది బ్రాహ్మణులకు సేవ చేసే ఫలితం దక్కుతుంది.  
 
ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది. వ్రతాన్ని ఆచరించే వ్యక్తి గోధుమలు, బార్లీ లేదా బియ్యం వంటి తృణధాన్యాలు లేదా ధాన్యాలు తినకూడదు.
 
తినే ఆహారాన్ని ఉప్పు లేకుండా చూసుకోవాలి. యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. రోజంతా శుభ్రంగా ఉంటూ, విష్ణువు కీర్తనలను జపించడం కూడా చాలా ముఖ్యం. ఉపవాసంతో పాటు ఆ రోజు రాత్రి.. జాగరణ చేయాలి. విష్ణుమూర్తి వద్ద ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. సుఖమయ జీవితం కోసం, మోక్షం కోసం ఈ వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.