1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (20:46 IST)

ఆషాఢమాసం ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే..?

ఆషాఢమాసం పవిత్రమైనది. ఈ మాసం పూజలకు, ఉపవాసాలకు శ్రేష్ఠమైనది. ఈ మాసం నుంచి చాతుర్మాస, ఆషాఢ గుప్త నవరాత్రులు, గురు పూర్ణిమ వంటి అనేక ముఖ్యమైన రోజులున్నాయి. ఈ మాసం మొత్తం సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. 
 
ఆషాఢంలో చేసే యాగాల ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. ఆషాడంలో పేదలకు ఉసిరి, గొడుగు, అన్నదానం చేయడం ద్వారా గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
ఈ మాసంలో శివవిష్ణువుల పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఆషాఢంలో ప్రతిరోజూ నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తే సమస్త దోషాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో వీరికి.. తామరపువ్వులు, ఎర్రటి పువ్వులు సమర్పించడం ద్వారా సర్వం సిద్ధిస్తుంది.