శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (14:23 IST)

కలలో గబ్బిలం కనిపిస్తే దుశ్శకునం.. అదే కుందేలు కనిపిస్తే?

కలలో గబ్బిలం కనిపిస్తే.. దుశ్శకునంగా భావించాలి. తెల్లగబ్బిలమైతే కుటుంబ సభ్యులతో ఒకరి మరణాన్ని, నల్లగబ్బిలమైతే వ్యక్తిగత విపత్తును సూచిస్తుంది. అదే కలలో కుందేలు కనిపిస్తే మాత్రం అదృష్టంగా భావించవచ్చు.

కలలో గబ్బిలం కనిపిస్తే.. దుశ్శకునంగా భావించాలి. తెల్లగబ్బిలమైతే కుటుంబ సభ్యులతో ఒకరి మరణాన్ని, నల్లగబ్బిలమైతే వ్యక్తిగత విపత్తును సూచిస్తుంది. అదే కలలో కుందేలు కనిపిస్తే మాత్రం అదృష్టంగా భావించవచ్చు. కలలోగానీ కుందేలు కనిపిస్తే.. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయని అర్థం చేసుకోవాలి. తెల్లకుందేలు నిజమైన ప్రేమకు గుర్తు. పచ్చిక బయళ్ళలో దూకుతూ.. ఆడుకుంటున్న కుందేలు కలలో కనబడితే.. పిల్లలు కలుగబోతున్నారని.. సంతానం ప్రాప్తిస్తుందని తెలుసుకోవాలి. 
 
ఇదే కలలో పులి-సింహం కనిపిస్తే.. సింహం బలానికి, శక్తికి ప్రతీక. సింహం కలలో కనిపిస్తే.. ఇతరులపై మీ ప్రభావం ఎక్కువగా చూపబోతున్నారని గుర్తించాలి. సింహం మీపై దాడి చేసినట్లు కలవస్తే మాత్రం ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. 
 
ఇక పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. అలాగే పశువులు కలలో కనిపిస్తే మీరు ప్రస్తుతమున్న పరిస్థితితో లేదా బంధాలతో జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.