మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (09:11 IST)

దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?

Lord Muruga
దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు విశేష పూజలు జరుపుతారు. దీనినే మహా స్కంధషష్ఠి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు.. అంటే ఆరు ముఖాలు గలవాడని, పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కంధుడు అని అంటారు. 
 
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన తరుణోపాయం. స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంధ పురాణం చెప్తోంది. 
 
ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యస్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం.