గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (15:52 IST)

శుక్రవారం పూట వేపచెట్టు కింద.. వెండిని పాతిపెడితే? (video)

శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల్లోపూ శుచిగా స్నానమాచరించి పూజ చేయాలి. పూజ పూర్తయ్యాక.. ఉప్పును కొనుక్కొచ్చి.. ఇంట్లోని ఉప్పు జాడీలో వేసివుంచాలి. ఇలా ప్రతీవారం చేస్తే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై వుంటుంది. తద్వారా ఆదాయానికి కొదువ వుండదు. అలాగే శుక్రవారం పూజలో ఐదు తమలపాకులు, ఐదు వక్కలు, ఐదు రూపాయి నాణేలు వుంచాలి. 
 
పూజ చేశాక తమలపాకు, వక్కలు, రూపాయి నాణేలను ఓ డబ్బాలో వేసి చేతికందని ప్రాంతంలో వుంచాలి. ఇలా 14వారాలు అయ్యాక ఆ తమలపాకులను సెలయేరు, సముద్రపు నీటిలో కలపాలి. ఇలా చేస్తే.. ఐశ్వర్యం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.  
 
కృష్ణపక్షంలోని తృతీయ నక్షత్రం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని తలచి.. అన్నదానం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా ప్రతీ మాసంలో వచ్చే తృతీయ నక్షత్రం రోజున చేయవచ్చు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవట్లేదని బాధపడేవారు శనివారం నీలి రంగు వస్త్రాన్ని  బీరువాల్లో డబ్బు వుంచే ప్రాంతంలో వుంచడం ద్వారా ధనాన్ని పొదుపు చేయవచ్చు. 
 
అంతేగాకుండా అప్పుల బాధకు దూరం కావాలంటే.. శుక్రవారం పూట వేపచెట్టు కింద కాస్త మట్టి తవ్వి.. అందులో వెండిని వుంచి పాతిపెట్టాలి. ఇలా చేస్తే.. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. రోజూ పక్షులకు బిస్కెట్లు, చిరుధాన్యాలను వుంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తగ్గిపోతాయి. ఇంటి చుట్టూ ఫౌంటైన్లు వుంటే ధనాదాయం చేకూరుతుంది. 
 
ఆవనూనెను వాడటం ద్వారా అప్పులు తీరిపోతాయి. అలాగే చీమలకు పంచదారను ఇంటికి బయట చల్లడం చేస్తే.. ఈతిబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.