బుధవారం, 29 మార్చి 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated: శనివారం, 19 నవంబరు 2022 (23:06 IST)

2022 ఉత్పన్న ఏకాదశి : తులసి కోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. దేవుత్థాన ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఇది. ఉత్పన్న ఏకాదశి ముఖ్యమైన ఏకాదశిలలో ఒకటి. 
 
ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి పుట్టిన రోజుగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
 
పారణ అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పారణ చేస్తారు. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తియ్యని పదార్థాలను సమర్పించవచ్చు. 
 
ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టును, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. 
 
ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ దూరమవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.