బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (11:56 IST)

మహిళలూ.. ఆనందం ఉంటే.. అందం మీ సొంతం.. అనవసర విషయాలు పట్టించుకోవద్దు..

మహిళలూ ఆనందంగా ఉన్నారా? అయితే అందంగా ఉంటారు. అంటున్నారు. బ్యూటీషన్లు. ఇంట్లో మహిళలు ఎంత ఆనందంగా ఉంటారో.. అంతే అందంగా ఉంటారని.. ఆనందమే అందాన్ని ప్రసాదిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తు

మహిళలూ ఆనందంగా ఉన్నారా? అయితే అందంగా ఉంటారు. అంటున్నారు. బ్యూటీషన్లు. ఇంట్లో మహిళలు ఎంత ఆనందంగా ఉంటారో.. అంతే అందంగా ఉంటారని.. ఆనందమే అందాన్ని ప్రసాదిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నా.. ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు చేస్తూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. 
 
ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని రాత్రి పడుకొనే వరకు పరుగులే. దీనితో ఆనందం అనేది మిస్ అవుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం.. ఆరోగ్యం పెను ప్రభావం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మహిళలు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత ఆనందంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు తేల్చారు. 
 
అందుకే అనవసర విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు. మానసిక ఆందోళనని పెంచే టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సంగీతాన్ని వినండి. ఏ పని చేసినా తొందర తొందరగా చేయకుండా ప్రశాంతంగా పక్కా ప్లాన్ ప్రకారం చేయాలి. తాజా ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయండి. ఇలా చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.. ఆరోగ్యంతో పాటు అందం కూడా చేకూరుతుంది.