ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: సోమవారం, 26 నవంబరు 2018 (11:51 IST)

నాకు భార్య లేదని తెలిసి నాతో వచ్చేస్తానంటోంది... ఏం చేయాలి?

మాది గుంటూరు. ఐతే హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాను. ఐదేళ్ల క్రితం ప్రమాదంలో భార్య దూరమైంది. ఆ బాధతో ఇక పెళ్లే వద్దని బతుకుతున్నాను. నాకో కుమార్తె వుంది. ఈమధ్య మా ఆఫీసులో ఓ యువతి పరిచయమైంది. నాతో ఎంతో చనువుగా మాట్లాడుతూ వుంటుంది. ఓ రోజు ఫ్యామిలీ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. 
 
నా భార్య లేదన్న సంగతి తెలుసుకుని బాధపడింది. ఐతే ఇటీవల హఠాత్తుగా నేనంటే ఇష్టమని అంటోంది. ఒప్పుకుంటే నాతో వచ్చేసి హాయిగా జీవిద్దామంటుంది. ఆమెకు పెళ్లయింది. భర్త వేరేచోట పనిచేస్తున్నారు. ఐతే ఆమె అంటే నాక్కూడా ఇష్టం ఏర్పడింది. కానీ నేను ఒప్పుకుని ఆమెను నా ఇంట్లో పెట్టుకుంటే ఆమె భర్త పరిస్థితి ఏంటి? ఏం చేయాలో తోచటంలేదు...
 
సరిగ్గానే చెప్పారు. మీమధ్య కొన్ని విషయాలపై జరిగిన చర్చ వల్ల ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగింది. కానీ అది హద్దులు దాటకూడదు. భార్యాభర్తలన్న తర్వాత చిన్నచిన్న మనస్పర్థలు వుంటాయి. ఆ సమస్యల వల్ల ఆమెలో ఇలాంటి ఆలోచనలు రేకెత్తి వుండవచ్చు. అసలు ఆమె ఎందుకిలా నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో కనుక్కోండి. అంతేకాని, ఆమె అన్నది కదా అని మీరు కూడా తొందరపడవద్దు. పెళ్లయిన స్త్రీ, పైగా భర్త కూడా వున్నారు కాబట్టి ఆమె గురించి అంత తేలిగ్గా మీరు ఓ నిర్ణయానికి రావడం మంచిదికాదు.