శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (18:29 IST)

వ్యక్తిగతంగా మీరు ఎదగాలంటే.. ఆహార్యంలో మార్పులు అవసరం..

వ్యక్తిగతంగా మీరు ఎదగాలంటే.. నిష్పక్షపాతంగా ఉండాలి. బలహీనతలను మార్చుకోవడంపై కఠినత్వంగా ఉండాలి. బలాలు, బలహీనతలు ఏంటో కనుక్కోవాలి. వాటిని అధిగమించాలి. మీరు చేసే పనుల్ని, చేయని పనుల్ని వేర్వేరుగా విభజించ

వ్యక్తిగతంగా మీరు ఎదగాలంటే.. నిష్పక్షపాతంగా ఉండాలి. బలహీనతలను మార్చుకోవడంపై కఠినత్వంగా ఉండాలి. బలాలు, బలహీనతలు ఏంటో కనుక్కోవాలి. వాటిని అధిగమించాలి. మీరు చేసే పనుల్ని, చేయని పనుల్ని వేర్వేరుగా విభజించుకోవాలి. మార్పుని అంగీకరించలేం అనుకుంటే మాత్రం మీ ఉన్నతి కష్టమే.
 
ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచన ఉన్నప్పుడు దానికి తగ్గ నిర్వహణా సామర్థ్యాలను పెంచుకోవడానికి రోజూ కొంత సమయాన్ని కేటాయించడం తప్పనిసరి. పనికి పరిధి ఉండదు. అలానే ఒకటే మూసధోరణీ తగదు. మన చుట్టూ వచ్చే మార్పుల్ని గమనించుకుంటూ, మన ఆలోచనల్లో, పనితీరులో, ఆహార్యంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లగలగాలి. అప్పుడే విజయం సొంతం అవుతుంది. డ్రెస్ కోడ్ మార్చడం.. మూడ్‌ను మార్చేవిధంగా స్నేహితులతో మాట్లాడటం.. అందంగా తయారై అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం చేస్తే తప్పకుండా మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
ఎదుటివారి బలాలు మనలోని బలహీనతల్ని పెంచకూడదు. అందుకే అవతలివారి విజయాన్ని చాలామంది మనస్ఫూర్తిగా ఒప్పుకోలేరు. ఎప్పటికప్పుడు మీ పనితీరుని మరింతగా సాన పెట్టుకుంటే కోరుకున్న విజయం సొంతమవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.