గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (17:25 IST)

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా? దానికోసం టైమ్ కేటాయించాల్సిందే.. లేదంటే గోవిందా..?

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా? సెలవులు ఇద్దరికి ఒకేరోజున లభించట్లేదా? అయితే మీ భార్యాభర్తల అనుబంధానికి ముప్పే అంటున్నారు.. సైకాలజిస్టులు. ఒకప్పుడు గృహిణులు ఆఫీసుకు వెళ్ళిన భర్త కోసం వేచి చూస్

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా? సెలవులు ఇద్దరికి ఒకేరోజున లభించట్లేదా? అయితే మీ భార్యాభర్తల అనుబంధానికి ముప్పే అంటున్నారు.. సైకాలజిస్టులు. ఒకప్పుడు గృహిణులు ఆఫీసుకు వెళ్ళిన భర్త కోసం వేచి చూస్తూ.. ఆయనతో సమయం గడిపేందుకు టైమ్ లేదని బాధపడేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్సైంది. 
 
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో ఇద్దరిలోనూ తమ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నామనే బాధ ఎక్కువైందని అంటున్నారు.. మానసిక నిపుణులు. భార్యతో లేదా భర్తతో గడిపేందుకు సమయం లేకపోవడం.. ఉద్యోగాలతో బిజీ అయిపోవడంతోనే కొత్త సంబంధాలను వెతికే పనిలో మనస్సు పడిపోతుందని.. దీంతో భార్యాభర్తల అనుబంధానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే కేవలం పండగలు, ఇతర సెలవు దినాల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అంటున్నారు మానసిక నిపుణులు. ఎలాంటి హడావిడి లేకుండా, తీరిగ్గా, హాయిగా ఒకరితో ఒకరు గడిపిన క్షణాలు ఎంతో అపురూపమైనవి. అందుకే భాగస్వామితో మాట్లాడటం మరవకూడదు. ఆఫీసుల్లో టైమ్ లేకపోయినా రెండు నిమిషాలైనా వారితో మాట్లాడాలి. అప్పుడే భార్యాభర్తల అనుబంధానికి ప్రస్తుత ఫాస్ట్ యుగంలో తెరపడదని మానసిక నిపుణులు అంటున్నారు.