సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (12:34 IST)

శనివారం రోజున హనుమంతుడికి తైలం సమర్పణ చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతు

భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతుంటారు. ఇక హనుమంతుడికి శనివారాం రోజున తైలం సమర్పించడం వలన శనిదేవుడు శాంతిస్తాడని కూడా ఆధ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
 
శనిదోషం వలన ఎంతటి వారైనా నానా రకాల బాధలను అనుభవించవలసి ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడం వలన ఆయనకి శాంతి కలుగుతుంది. ఫలితంగా శనిదోష ప్రభావం తగ్గిపోతుంది.
 
అలా శని దేవునికి ప్రీతి కలిగించే పనుల్లో ఒకటిగా శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చెప్పబడుతోంది. అందువలన శనిదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నవారు శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.