స్వర్ణం దానంగా ఇస్తే.. ఏమవుతుంది..?
సాధారణంగా దానాలు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. కానీ, దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు వారు తెలుసుకోరు. అలాంటివారికి ఈ కథనం చాలా ఉపయోగపడుతుంది. ఈ కింద తెలిపిన వాటిని దానంగా ఇస్తే కలిగే ఫలితాలు ఓసారి తెలుసుకుందాం..
గవ్యం, రజతం, స్వర్ణం, వస్త్రం, సర్పి, ఫలం, జలం ఇవి బ్రాహ్మణులకిచ్చేవాడు చంద్రలోకంలో ఒక మన్వంతరం కాలం ఉంటాడు. శుచియైన బ్రాహ్మణునకు చక్కని వర్ణంగల గోవులను దానంగా ఇచ్చేవాడు సూర్యలోకంలో పదివేల సంవత్సరాలు నివసిస్తాడు. విప్రులకు అధికంగా భూదానం, ధనదానం, గృహదానం చేసేవాడు విష్ణులోకంలో ఆచంద్ర తారార్కంగా దివ్యసుఖం అనుభవిస్తాడు.
ఇష్ట దైవానికి ఆలయాన్ని నిర్మించి ఇచ్చేవాడు ఆ దైవానికి సంబంధించిన లోకంలో చిరకాలం గడుపుతాడు. దైవానికిగానీ, బ్రాహ్మణునకుగానీ ఒక సౌధాన్ని కట్టించి ఇచ్చినా లేక ఒక దేశాన్ని దానంగా ఇచ్చినా వానికింకా ఎన్నో రెట్లు ఫలం లభిస్తుంది.