ఫిబ్రవరి 16న రథసప్తమి.. పూజ ఎలా చేయాలి..
రథసప్తమిని సూర్య జయంతి, భాను సప్తమి, మహా సప్తమి, భీష్మ సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
రథసప్తమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే ఫలితం ఉంటుంది. మూడు, ఐదు, ఏడు ఆకులు వాటి మీద అక్షితలు, రేగుపళ్లు ఉంచి తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల కర్మణా చేసిన పాపాలు, జన్మ జన్మ పాపాలు, తెలిసీ తెలియక చేసిన ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి.
ఈరోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇంకా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఫిబ్రవరి 16, శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది.
2024 రథ సప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ధనవంతులు, కీర్తి, శక్తి, శక్తి, జ్ఞానం, అనారోగ్యం నుండి స్వస్థత, హానికరమైన శక్తుల నుండి రక్షణ లభిస్తాయి.