సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chitra
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (21:17 IST)

సప్తశృంగి మాత వద్దకు వెళ్లమన్న షిర్డీ సాయిబాబా... ఎందుకు...?

షిర్డీకి సమీపంలో సప్తశృంగి అమ్మవారి ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం షిర్డీకి దగ్గర్లో ఓ కొండపై ఉంది. ఇక్కడ ఏడుకొండలు ఉండటం వలన సప్తశృంగి అనే పేరు వచ్చింది. ఏడు కొండలు దాటాక ఒక కొండశిఖరంపై ఈ అమ్మవారి దేవాలయం ఉంది. కొండమీదకి వెళ్ళడానికి, దిగడానికి వేరువేరుగ

షిర్డీకి సమీపంలో సప్తశృంగి అమ్మవారి ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం షిర్డీకి దగ్గర్లో ఓ కొండపై ఉంది. ఇక్కడ ఏడుకొండలు ఉండటం వలన సప్తశృంగి అనే పేరు వచ్చింది. ఏడు కొండలు దాటాక ఒక కొండశిఖరంపై ఈ అమ్మవారి దేవాలయం ఉంది. కొండమీదకి వెళ్ళడానికి, దిగడానికి వేరువేరుగా మెట్లున్నాయి. 420 మెట్లు ఎక్కి కొండమీదకి వెళ్తే, అమ్మ దర్శనం లభిస్తుంది.
 
పూర్వము దండకారణ్యంలో మహిషాసురడనే రాక్షసుడు సంచరిస్తూ ప్రజలను, మునులను, యజ్ఞయాగాలు చేసేవారిని హింసిస్తూ బీభత్సం సృష్టించడంతో దేవతలు, మునులు ఆ పరాశక్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనను విన్న అంబ, మహిషాసుర సంహారం కోసం మహిషాసుర మర్దినిగా అవతరించి, ఆ ఘోర రాక్షసుని సంహరించి అక్కడ వాతావరణం బాగుందని, సప్తశృంగి కొండపై భక్తులను అనుగ్రహించడానికి వెలసిన కారుణ్యమూర్తిగా చెబుతారు. దీనిని ఓ శక్తిపీఠంగా పేర్కొని మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా అంబని కొలుస్తారు. 
 
మొత్తం 51 శక్తిపీఠాలు మన భారతదేశంలో వున్నట్లుగా చెబుతారు. మహారాష్ట్రలోనే నాలుగు శక్తిపీఠాలున్నాయి. సప్తశృంగిలో అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా వుండి భీకరంగా ఉంటుంది. అష్టభుజాలతో పెద్ద కళ్ళతో సప్త శృంగిమాత రూపం గోచరిస్తుంది. అమ్మవారి విగ్రహం 10-12 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ అమ్మ ఆలయం గోచరిస్తుంటుంది. ఒక భక్తుడు సప్తశృంగి మాతకు ముడుపులు కట్టి ఆ ముడుపులను చెల్లించలేదని శ్రీసాయి బాబావారు గుర్తు చేసి సప్తశృంగి పంపినట్లు బాబాగారి చరిత్ర తెలియజేస్తోంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దగ్గరలో ఉన్న నాసిక్‌కు వెళ్ళి బస చేస్తారు.