సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (09:35 IST)

మౌని అమావాస్య.. విష్ణుపూజ.. అన్నదానం మరిచిపోకండి..

మాఘమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మౌని అమావాస్య రోజున ఎవరైతే గంగాస్నానంతో పాటు నారాయణుడిని పూజిస్తారో వారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు. 
 
దీనితో పాటు వారి కోరిక నెరవేరుతాయి. కోటి స్నానాలతో వచ్చే పుణ్యం మౌని అమావాస్యనాడు గంగానదిలో చేసే స్నానంతో వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
గంగతో పాటు ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వలన కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది. మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షంతో పాటు పుణ్య ఫలాలు లభిస్తాయి.  
 
అంతేకాకుండా పితృ తర్పణం చేయడానికి కూడా ఇది అత్యుత్తమమైన రోజు. నదీస్నానం చేసిన తర్వాత సూర్యునిక అర్ఘ్యం సమర్పించి.. పితృ తర్పణం చేయాలి. పేద బ్రాహ్మాణులకు, పేదలకు అన్నదానం చేయాలి.