ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (13:55 IST)

భక్తులకు అలెర్టు.. ఆ రోజుల్లో శ్రీవారి అర్జిత సేవలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. అలాగే ఓ హెచ్చరిక చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోవడంతో తిరుమలలో అన్ని రకాల కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, ఈ నె 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్వామివారికి తెప్పోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాల కాలంలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జిత సేవలను రద్దు చేసింది. 
 
స్వామివారి తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ అర్జిత సేవలైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14 తేదీల్లో, 15, 16, 17 తేదీల్లో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని కోరింది. తెప్పోత్సవాల్లో భాగంగా, శ్రీవారు పడవ లేదా ఓడలో సుఖాశీనులై ఆలయ కోనేరులో విహరిస్తారు. తిరుమల గిరుల్లో ఈ తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి.