శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:34 IST)

యూఎస్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ నిష్క్రమణ

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ నుంచి స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ఊహించని రీతిలో నిష్క్రమించాడు. కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కోసం ఆయన బరిలోకి దిగాడు. మోకాలి గాయం తిరుగబెట్టడంతో సెమీస్ మ్యాచ్ మధ్యలోనే

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ నుంచి స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ఊహించని రీతిలో నిష్క్రమించాడు. కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కోసం ఆయన బరిలోకి దిగాడు. మోకాలి గాయం తిరుగబెట్టడంతో సెమీస్ మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో మూడోసీడ్ డెల్ పోట్రో (అర్జెంటీనా) 7-6, (7/3), 6-2 ఆధిక్యంలో ఉన్న దశలో డిఫెండింగ్ చాంపియన్ నాదల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
 
ఫలితంగా నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకోవాలన్న ఆశకు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయాడు. ఈ సీజన్‌లో గాయంతో వైదొలగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మారిన్ సిలిచ్‌తో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లో ఐదోసెట్ మధ్యలో నుంచి నాదల్ తప్పుకున్నాడు. దాదాపు 16 గంటలపాటు మ్యాచ్‌లు ఆడి సెమీస్‌కు చేరుకున్న నాదల్‌ను కుడి మోకాలి గాయం తీవ్రంగా ఇబ్బందిపెట్టడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.